LAWCET: లాసెట్ ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్! 14 d ago

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యామండలి లా కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (ఏపీ లాసెట్)/ పోస్ట్ గ్రాడ్యుయేట్ లా కోర్స్ ఎల్ఎల్ఎం-(ఏపీ పీజీఎల్‌సెట్)-2025 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈపరీక్షను తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం నిర్వహించనుంది. ఏపీలోని విశ్వవిద్యాలయాలు వాటి అనుబంధ కళాశాలల్లో 5,3,2 ఏళ్ల ఎల్ఎల్‌బీ, ఎల్‌ఎల్ఎం/ ఎంఎల్ కోర్సుల్లో 2025-26 విద్యా సంవత్సరానికి ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రవేశాలు పొందవచ్చు. ప్రవేశ పరీక్ష జూన్ 5వ తేదీన జరగనుంది. విద్యార్హత కోర్సును అనురించి 45 శాతం మార్కులతో ఇంటర్మీడియట్, డిగ్రీ, ఎల్ఎల్‌బీ, పీజీ ఉత్తీర్ణత కలిగి ఉండాలి. దరఖాస్తు ఫీజు కోర్సును అనుసరించి రూ. 1000. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేది ఏప్రిల్ 27. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.